
రాజకీయాలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్, డ్రామా, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
చిత్రీకరణ పూర్తి చేసిన అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. సంగీత పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసే అవకాశముండటంతో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!