

‘శంబాల’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న హీరో ఆది సాయికుమార్, షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, సమర్పకుడు యుగంధర్ ముని మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. హారర్, ఎమోషన్స్, ఉత్కంఠ, ఎంటర్టైన్మెంట్ అంశాలను కలిపిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోందని చిత్రబృందం తెలిపింది.

రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్లో ఆది సాయికుమార్ రక్తంతో కనిపించే ఇంటెన్స్ లుక్, చుట్టూ పువ్వులు, ఆకులు, పాతకాలం నాటి స్టాంప్ డిజైన్ వంటి అంశాలు ఓ మిస్టీరియస్ ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం కీలకమని భావించిన మేకర్స్ మరోసారి సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ను తీసుకున్నారు. సరికొత్త సౌండ్ డిజైన్, బీజీఎం, నిశ్శబ్ద క్షణాల ద్వారా కూడా ప్రేక్షకుల్లో భయాన్ని, ఉత్కంఠను పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు టీం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!