

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న మెగా158 సినిమాకు టైటిల్‌ను ‘కాకా’గా ప్రకటించారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అలాగే ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ఇదే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ ఓదెల. ఆయనతో కలిసి ‘టీ-రెక్స్’ సినిమాను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. షూటింగ్ ప్రారంభించి, మెగాస్టార్‌తో జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవాలని ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని భావించిన అభిమానులకు ఇది సర్‌ప్రైజ్‌గా మారింది. శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌కు చిరంజీవి కూడా స్పందించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!