
రాజకీయాలు

టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ ప్రకటిస్తూ అధికారిక లేఖ విడుదల చేసింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ భార్య సుమలత వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించింది. ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మరియు ప్రముఖులు తీసుకున్న నిర్ణయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.
సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అవకాశం ఇచ్చినా, స్పందన రాలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇకపై అసోసియేషన్‌కు ఎలాంటి సహాయం అందించబోమని, సమస్యల పరిష్కారంలో బాధ్యత తీసుకోబోమని తెలిపింది. వేతనాల ఒప్పందం విషయంలో కూడా మద్దతు ఉండదని పేర్కొంది. ఈ నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ కొనసాగించే అవకాశముంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!