

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహిళలు పెళ్లి కంటే తమ వ్యక్తిత్వం, కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ పంచుకున్నారు. యువతులు పెళ్లికి ముందు ఆర్థిక స్వాతంత్య్రం సాధించి, తమ కెరీర్‌ను బలంగా నిర్మించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఇటీవల వివాహిత మహిళలకు సంబంధించిన విషాద ఘటనలు పెరుగుతున్నాయని, కొంతమంది చదువుకున్న యువతులు కూడా కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహాయం కోరుతున్నారని తెలిపారు.
భారతీయ సమాజంలో పెళ్లి తర్వాత కూతుళ్లను ఒంటరిగా వదిలేస్తారని కంగనా వ్యాఖ్యానించారు. అందుకే మహిళలు తమ జీవితానికి తామే బాధ్యత వహించాలని, ఎవరూ కాపాడటానికి రారని స్పష్టం చేశారు. మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారన్నదికంటే మీరు ఏం చేస్తున్నారు, ఎవరు అనేదే ముఖ్యమని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి. ఇదిలా ఉండగా, కంగనా నటిస్తున్న ‘భారత భాగ్య విధాత’ చిత్రం వచ్చే నెల 12న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!