
జనరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి. భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ను కలవగా, బాలకృష్ణ ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో సినిమా, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. భరత్ భూషణ్ గత 20 సంవత్సరాలుగా సినిమాల డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. భరత్ ఇన్ఫ్రా సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా మరియు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను చైర్మన్గా నియమించడం పట్ల సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!