

టాలీవుడ్ నటి నభా నటేష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’లో నటిస్తున్న ఆమెకు తాజాగా మరో ఆసక్తికరమైన అవకాశం దక్కింది. కన్నడ యాక్షన్ హీరో ధృవ్ సర్జా సరసన హీరోయిన్గా నభా నటేష్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేసింది. ‘కెమిస్ట్రీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. “కొంచెం ఆకర్షణ.. కొంచెం మాయ.. ఇంకా ఎన్నో” అంటూ చిత్రబృందం ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జత చేసింది.
తాజాగా విడుదల చేసిన పోస్టర్లో నభా నటేష్, ధృవ్ సర్జా వర్షంలో తడుస్తూ ఒకరినొకరు హత్తుకున్న రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. ఈ కొత్త జోడీకి సంబంధించిన పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కృతి ప్రసాద్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!