

అల్లు అర్జున్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఏఏ23’పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తెరపడింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ.. ప్రాజెక్ట్ కొనసాగుతోందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు ఇతర ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ‘ఏఏ23’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ‘ఏఏ23’ థీమ్ సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!