
టెక్నాలజీ

సీనియర్ హీరోయిన్ రాశీకి నటి, యాంకర్ అనసూయ అధికారికంగా క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ టెలివిజన్ షోలో తెలుగు సరిగా రానితనంపై చేసిన స్కిట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని అనసూయ X వేదికగా వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు రాయించిన, డైరెక్ట్ చేసిన వ్యక్తిని అప్పుడే నిలదీయాల్సి ఉండగా, ఆ సమయంలో తన శక్తి సరిపోలేదని ఆమె పేర్కొన్నారు.
షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తనలో స్పష్టమైన మార్పు వచ్చిందని, మనుషులు మారతారని అందరూ గుర్తించాలని అనసూయ కోరారు. గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత శక్తిమంతంగా, బాధ్యతాయుతంగా మారానని చెప్పారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే అది ఉద్దేశపూర్వకమైనది కాదని స్పష్టం చేస్తూ, రాశీకి మరోసారి క్షమాపణలు తెలిపారు.
.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!