
క్రీడలు

‘గదర్ 2’తో మళ్లీ విజయాన్ని అందుకున్న అమీషా పటేల్, సోషల్ మీడియాలో పీఆర్ టీమ్స్ ద్వారా స్టార్డమ్ కొనుగోలు చేసే ట్రెండ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 100 కోట్లు, 200 కోట్లు దాటని వారు తాము స్టార్లమని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. నిజమైన విజయమే స్టార్డమ్కు ప్రమాణమని స్పష్టం చేశారు.
తన కెరీర్లో ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’, ‘గదర్ 2’ వంటి బ్లాక్బస్టర్లు ఉన్నాయని గుర్తు చేసిన అమీషా, ‘గదర్ 3’తో 500 కోట్ల వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఫేక్ ప్రమోషన్స్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!