

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘#AA23’గా పిలవబడుతున్న ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం స్పెషల్ వీడియోను కూడా విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీవాస్‌తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘#AA22xA6’లో నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్లో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ తదుపరి సినిమా ఏదన్నదానిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా పురాణాల నేపథ్యంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుందన్న ప్రచారం జరిగినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌పై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ హైదరాబాద్ రావడం, అల్లు అర్జున్ నివాసానికి వెళ్లడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కూలీ’ తర్వాత లోకేశ్ తన LCUలో భాగంగా ‘ఖైదీ 2’ తెరకెక్కిస్తారని అందరూ భావించినప్పటికీ, అల్లు అర్జున్‌తో సినిమా ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా పక్కకు వెళ్లినట్టే కనిపిస్తోంది.
సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే లాక్ అయింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైంది. అట్లీ మూవీ పూర్తి అయిన తర్వాత కొంత విరామం తీసుకుని అల్లు అర్జున్ #AA23 సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పూర్తిగా కొత్త తరహా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో, గత చిత్రాలకు భిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో అల్లు అర్జున్ కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కనగరాజ్ మేకింగ్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌కు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!