
గాసిప్స్

ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో వైజాగ్ ఇన్ఓర్బిట్ మాల్‌లో నిర్మించిన AAA సినిమాస్‌ను ఆగస్టు 9న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ముంబై షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎనిమిది స్క్రీన్లతో రూపొందిన ఈ మల్టీప్లెక్స్‌లో ప్రాంతంలోనే అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రారంభోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆహ్వానితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రవేశం కల్పించనుండగా, అల్లు అర్జున్ పర్యటన ముగిసిన తర్వాత ఆగస్టు 10 నుంచి సాధారణ ప్రేక్షకులకు AAA సినిమాస్ అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!