
సినిమాలు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు అల్లు శిరీష్ మరియు నయనికా రెడ్డి దంపతులను ఆశీర్వదించేందుకు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తమ నివాసానికి రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేస్తూ ఆయన తన కృతజ్ఞతలను తెలియజేశారు.

చంద్రబాబు నాయుడు తమ ఇంటికి వచ్చిన సమయంలో తాను విదేశాల్లో ఉండటంతో ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అయితే ఫోన్లో ఆయనతో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పారు. నూతన దంపతులకు అందించిన ఆశీస్సులు మరియు చూపిన ఆత్మీయతకు తమ కుటుంబం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని అల్లు అర్జున్ తన పోస్టులో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!