

‘హనుమాన్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)ను మరింత విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా ‘జై హనుమాన్’తో పాటు ‘మహాకాళి’ అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. భారతీయ సూపర్‌హీరో చిత్రాల్లో మహిళా శక్తిని ప్రధానంగా చూపించే విభిన్న ప్రయత్నంగా ఈ సినిమా రూపొందుతోంది. పూజా అపర్ణ కొల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. తాజాగా ఆగస్టు 24న ‘మహాకాళి’ మాస్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నా ప్రత్యేక లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన అసురుల గురువైన శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నారు. భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మిస్టరీ, ఆధ్యాత్మికత, సూపర్‌హీరో అంశాలను మేళవించినట్లు తెలుస్తోంది. రియాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్‌పై ప్రస్తుతం భారీ ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!