

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 206 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో ఫైఫర్ నమోదు చేసిన సుతార్.. మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు.
శ్రీలంక తరఫున సోనాల్ దినుష 84, కెప్టెన్ ధనంజయ డిసిల్వా 59 పరుగులతో పోరాడారు. ఒక దశలో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను ఇబ్బంది పెట్టారు. అయితే జడేజా ధనంజయను ఔట్ చేయడంతో భాగస్వామ్యం ముగిసింది. అనంతరం మానవ్ సుతార్ 76వ ఓవర్‌లో సోనాల్ దినుష, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమారలను వరుసగా ఔట్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా, శ్రీలంక 284 పరుగులకు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులు చేసింది. భారీ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలోనే ఉన్నప్పటికీ, పర్సంటేజీ 53.33కు పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!