

2027 సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో భారీ పోటీకి వేదిక కానుంది. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాలు పండుగ బరిలో తమ విడుదలను లక్ష్యంగా చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లోని మెగా158, వెంకటేశ్–కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం, రవితేజ–శ్రీవిష్ణు కాంబినేషన్‌లో హసిత్ గోలి తెరకెక్కిస్తున్న సినిమా ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. వీటితో పాటు సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, శర్వానంద్–శ్రీను వైట్ల కాంబినేషన్‌లోని ‘జార్జ్ క్రిష్’ కూడా సంక్రాంతి రేసులో ఉన్నట్లు సమాచారం.
ఒకే సీజన్‌లో ఇన్ని భారీ చిత్రాలు బరిలోకి దిగుతుండటంతో థియేటర్ల కేటాయింపు, ప్రేక్షకుల ఆదరణ, ఓపెనింగ్స్, బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో పోటీ ఆసక్తికరంగా మారనుంది. మరికొన్ని చిత్రాలు కూడా సంక్రాంతి 2027 విడుదలను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో వచ్చే సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లోనే అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!