

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రానున్న ‘అఖండ-2: థాండవం’ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విడుదలైన ‘మాసివ్ థాండవం’ టీజర్ అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది!
టీజర్ మొదటి నుంచే దేశీయ, విదేశీ శక్తులు సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని, భారత్‌ను అస్థిరం చేయాలని చూస్తున్నాయన్న గంభీర హెచ్చరికను అందిస్తుంది. భక్తిపై దాడి జరిగితే అగ్నికీలలా ఎదురొస్తాడు అఖండుడు! మేఘాలను చీల్చుకుని వచ్చే ఆంజనేయుడి దివ్యదర్శనంతో ముగిసే ఈ టీజర్ పాన్-ఇండియా స్థాయి గ్రాండియర్‌ను చాటింది.
బాలయ్య అఖండావతారంలో దివ్య క్రోధం, హర్షాలీ మల్హోత్రా ఎమోషనల్ లేయర్, సంయుక్త హీరోయిన్ గా, ఆది పినిశెట్టి పవర్ఫుల్ విలన్‌గా కనిపించారు. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం, ఏఎస్ ప్రకాష్ డిజైన్‌తో 14 రీల్స్ ప్లస్ భారీ స్కేల్ కనిపిస్తోంది. డిసెంబర్ 5 న థియేటర్లను థాండవం చేయడానికి సిద్ధం!









.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!