

లిటిల్ సోల్జర్స్, ఐతే, అనుకోకుండా ఒక రోజు వంటి విభిన్నమైన చిత్రాలతో పాటు అమృతం టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ దర్శకనిర్మాత, రచయిత గుణ్ణం గంగరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. చందమామలో అమృతం వంటి సినిమాల పరాజయాల తర్వాత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన, దాదాపు పదేళ్ల విరామం అనంతరం ఆకాశంలో ఒక తార సినిమాతో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేతో పాటు మాటలను కూడా అందించి తన ప్రత్యేకమైన రచనా శైలిని మరోసారి పరిచయం చేశారు.
పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ముఖ్యంగా గుణ్ణం గంగరాజు అందించిన ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే, పదునైన సంభాషణలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖర్ యేలేటి వంటి దర్శకుడిని పరిచయం చేయడంతో పాటు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన గంగరాజు మళ్లీ సినిమాల్లో చురుకుగా కనిపించడం తెలుగు సినీ అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!