

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ కే దీక్ష” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల 12 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో హీరోగా కిరణ్ నటించగా, హీరోయిన్లుగా అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. దీక్ష, పట్టుదలతో జీవితంలో ఏదైనా సాధించవచ్చనే కాన్సెప్ట్‌తో కథను రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. భీముని పాత్రలో హీరో చెప్పే వన్ మినిట్ డైలాగ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్నీ సమతూకంగా ఉంటాయని, తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని చెప్పారు. హీరోయిన్ అక్స ఖాన్ ఈ చిత్రంలో డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తూ ‘నంది నంది’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సీనియర్ నటి తులసి మాట్లాడుతూ సైనికుల ధైర్యసాహసాలను ప్రతిబింబించే పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. త్వరలో ఆడియో విడుదల చేసి, మహిళా కబడ్డీ నేపథ్యంలో తదుపరి చిత్రం ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!