

'ఫ్రమ్' అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్‌గా నిలిచింది. జాన్ గ్రిఫిన్ సృష్టించిన ఈ సిరీస్ 2022లో మొదటి సీజన్‌తో ప్రారంభమైంది. 2023లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దీంతో నాలుగో సీజన్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఏప్రిల్ 20న నాలుగో సీజన్ విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించింది.
రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా పడిపోయే చెట్టు కారణంగా, వేరే మార్గం ఎంచుకుంటారు. ఆ మార్గం ఒక నిర్మానుష్య టౌన్‌కు దారి తీస్తుంది. ఎంతసేపు ప్రయాణించినా మళ్లీ అదే ప్రారంభ స్థానానికి వచ్చేస్తారు. రాత్రి అయితే ఆ టౌన్‌లో దెయ్యాలు మనుషులను చంపేందుకు బయటకు వస్తాయి. ఇంటి తలుపుకు లాకెట్ వేసినా, ఆ దెయ్యాలు లోపలికి వచ్చి రక్తపాతం సృష్టిస్తాయి.
టౌన్‌లో స్థిరపడిన వారు రాత్రి భయంతో గడుపుతారు. ఎప్పటికైనా స్వగ్రామం చేరుకోవాలనే ఆశతో జీవితం కొనసాగిస్తారు. నాలుగో సీజన్‌లో ఈ భయంకర ప్రదేశం ఎవరు సృష్టించారనే రహస్యం బయటపడవచ్చు. ఈ సిరీస్ ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!