

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో జాతీయ స్థాయిలో దూసుకుపోతుండగా, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే కొత్త సినిమా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉండగా, ఈ కొత్త కాంబినేషన్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ సరసన మరోసారి పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
‘అల వైకుంఠపురములో’ తర్వాత ఈ జోడీ మళ్లీ తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు మంచి ట్రీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే నటి రెజీనా కసాండ్రా కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌కు ప్రసిద్ధి చెందిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం మరింత భారీ స్థాయిలో రూపొందనున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కొనసాగుతుండగా, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!