

హారర్ కామెడీ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘కాంచనా’ ఫ్రాంచైజీ ఇప్పుడు నాలుగో భాగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ మరోసారి ఈ సిరీస్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్స్‌ప్యాక్ బాడీతో భయానక వాతావరణంలో కనిపించిన లారెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈసారి సినిమా మరింత స్టైలిష్‌గా, భారీ స్థాయిలో రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై యువతలో మరింత ఆసక్తి పెరిగింది. గతంలో వచ్చిన ‘ముని’, ‘కాంచనా’, ‘గంగ’ చిత్రాలు భారీ విజయాలు సాధించగా, ఇప్పుడు నాలుగో భాగంలో మరింత డార్క్ హారర్ కథను చూపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. భారీ సెట్స్, స్టైలిష్ విజువల్స్, హారర్ కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. త్వరలోనే టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!