
జనరల్

ప్రేమ, స్నేహం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా నుంచి విడుదలైన ‘హే మంగా’ పాట సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సంగీత ప్రియులను ఆకట్టుకుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యానికి ఎల్‌వీ రేవంత్ తన గాత్రంతో ప్రాణం పోశాడు. హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, మెలోడి ట్యూన్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!