

చికెన్‌తో ఎప్పుడూ ఒకే రకమైన కూరలు తింటూ బోర్ కొడుతోందా? అయితే శెనగపప్పు చికెన్ కర్రీని ఒకసారి ప్రయత్నించండి. చికెన్‌కు శెనగపప్పు, ప్రత్యేక మసాలాలు జోడించి తయారు చేసే ఈ వంటకం మంచి రుచితో పాటు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది. ఈ కూర తయారీకి అర కిలో చికెన్, అర కప్పు పచ్చి శెనగపప్పు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఉప్పు, నూనె అవసరం. అలాగే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులతో ప్రత్యేక మసాలా సిద్ధం చేసుకోవాలి. ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి అరగంట నుంచి గంటసేపు నానబెట్టాలి. చికెన్‌కు ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మిగిలిన మసాలా పదార్థాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
తయారీ కోసం ఒక పాన్‌లో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్‌ను వేసి కొద్దిసేపు వేయించాలి. నానబెట్టిన శెనగపప్పును జోడించి బాగా కలపాలి. అనంతరం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి, రుచికి సరిపడా ఉప్పు జోడించి మూత పెట్టి మీడియం మంటపై ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కారం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఒక గ్లాసు నీరు పోసి చికెన్, పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. చివరగా గ్రేవీ చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన శెనగపప్పు చికెన్ కర్రీ సిద్ధం. అన్నంతో పాటు రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీతో కూడా ఈ కూరను ఆస్వాదించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!