6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

Writer: Chandrika 12:41 PM, 6 నవంబర్, 2026
పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

పేదలకు సొంత ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల పథకం.. పెద్ద దోర్నాలలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. గ్రామానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు. పెద్ద దోర్నాల, అయినముక్కుల, తిమ్మాపురం, అసానాబాద్‌, జమ్మిదోర్నాల, చిన్నదోర్నాల గ్రామాలకు చెందిన 410 మంది లబ్ధిదారులకు పదెకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం కింద నేల చదును, రహదారుల నిర్మాణానికి రూ.కోటికి పైగా వెచ్చించగా.. విద్యుత్తు, నీటి వసతి తదితర పనుల కోసం మరో రూ.కోటి ఖర్చు చేశారు. ఐదు బోర్లు వేసి చిన్న నీటి ట్యాంకులను కూడా నిర్మించారు.

అయితే, జనావాసాలకు దూరంగా ఉండటంతో పాటు నివాసానికి అనువుగా లేకపోవడంతో లబ్ధిదారులు అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఒక్క ఇల్లు మాత్రమే పూర్తిస్థాయిలో శ్లాబు వేయగా.. మరో ఐదు ఇళ్లు శ్లాబు దశలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం కాలనీ మొత్తం చిల్లచెట్లు పెరిగి చిట్టడవిలా మారింది. బోర్ల మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లగా.. విద్యుత్తు పరివర్తకాలు కూడా కనిపించడం లేదు. నివాసయోగ్యమైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరుతున్నా, ఇప్పటికే వారి పేర్లపై స్థలాలు ఆన్‌లైన్‌లో నమోదైనందున మరోచోట కేటాయించడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని గృహనిర్మాణ శాఖ డీఈ సురేష్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

భారత రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యంపై చర్చ.. రాజ్‌దీప్, ప్రియాంక చతుర్వేది మధ్య వాదన

భారత రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యంపై చర్చ.. రాజ్‌దీప్, ప్రియాంక చతుర్వేది మధ్య వాదన

నీతా అంబానీ ₹12 కోట్ల వజ్రాల బ్రోచ్‌పై కరీనా కపూర్ రియాక్షన్ వైరల్

నీతా అంబానీ ₹12 కోట్ల వజ్రాల బ్రోచ్‌పై కరీనా కపూర్ రియాక్షన్ వైరల్

ట్యాగ్లు
జగనన్న కాలనీలుపెద్ద దోర్నాలవైఎస్సార్‌సీపీ ప్రభుత్వంఆంధ్రప్రదేశ్పేదలకు ఇళ్లుగృహ నిర్మాణ పథకం410 మంది లబ్ధిదారులుమౌలిక వసతులుప్రభుత్వ నిధులుగృహ నిర్మాణ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలీవుడ్‌లో దక్షిణాది నటులకు వివక్ష.. రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు!
గాసిప్స్

బాలీవుడ్‌లో దక్షిణాది నటులకు వివక్ష.. రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు!

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు
జనరల్

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
గాసిప్స్

పవన్ కల్యాణ్‌తో విడాకులపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన
రాజకీయాలు

‘నేను చేసిన తప్పేంటి?’.. పార్టీ సస్పెన్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్‌రెడ్డి ఆవేదన

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!
ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్
రాజకీయాలు

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ
జనరల్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్
గాసిప్స్

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా
సినిమాలు

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!
ఆరోగ్యం

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!