

పాలకూరతో రుచికరమైన, పోషకమైన దోశను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు దోశ పిండి, ఒక కట్ట పాలకూర, 10 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అర టేబుల్‌స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, దోశలు కాల్చేందుకు తగినంత నూనె తీసుకోవాలి. ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి, మిక్సీ జార్‌లో పాలకూర, నాలుగు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను దోశ పిండిలో వేసి ఉప్పు కలిపి బాగా కలపాలి.
తర్వాత పెనాన్ని వేడి చేసి, కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పాలకూర కలిపిన దోశ పిండిని పెనంపై పోసి పలచగా పరిచి మీడియం మంటపై ఉంచాలి. దోశ చుట్టూ, పైభాగంలో కొద్దిగా నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. దోశ కాస్త క్రిస్పీగా మారిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ పాలకూర దోశను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో వడ్డించుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!