

సాధారణంగా చేసే పులిహోర, ఫ్రైడ్ రైస్‌కు భిన్నంగా కొత్త రుచిని ఆస్వాదించాలనుకునేవారికి ధనియాల రైస్ మంచి ఎంపిక. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వంటి మసాలా దినుసులతో తయారు చేసే ఈ వంటకం మంచి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ఇంట్లో మిగిలిన అన్నంతో కూడా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు కప్పుల ఉడికించిన అన్నం, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, కరివేపాకు, నెయ్యి, నూనె, పసుపు, ఉప్పు అవసరం.
ముందుగా పాన్‌లో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో కొద్దిగా బరకగా పొడి చేసుకోవాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, వేరుశెనగ పలుకులు వేసి వేయించాలి. అనంతరం కరివేపాకు, పసుపు, సిద్ధం చేసుకున్న ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. చివరగా ఉడికించిన అన్నం, కొద్దిగా నెయ్యి వేసి మసాలా మిశ్రమం అన్నానికి బాగా పట్టేలా కలపాలి. అంతే.. వేడివేడి, సువాసనభరితమైన ధనియాల రైస్ సిద్ధం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!