

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ సూర్య 48. ‘జై భీమ్’ వంటి ప్రశంసలు అందుకున్న చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. హోంబాలె ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మే 1న సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బృందం, దీపావళి తర్వాత కీలకమైన ఓవర్సీస్ షెడ్యూల్ కోసం జపాన్ వెళ్లనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్కు విరామం దొరికిన సమయంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం సూర్య తన కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయ్యాకే ఆయన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!