

చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది వివిధ మందులు తీసుకుంటుంటారు. అయితే, ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఒక సరళమైన ఇంటి పానీయం తాగితే ఈ సమస్య నుంచి సహజంగా ఉపశమనం పొందవచ్చని అంటున్నారు.
నేటి జీవనశైలిలో జీర్ణ సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అందులో ఉబ్బరం ఒక ప్రధాన సమస్య. ఇది తీవ్రంగా ఉన్నప్పుడు శ్వాసలో ఇబ్బందులు కూడా కలిగిస్తుంది. అయితే, ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. ప్రత్యేకంగా, భోజనం చేసిన తర్వాత ఉబ్బరం అనిపించడం సాధారణమే కానీ, ఈ ప్రత్యేక పానీయం తాగితే సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
తయారీ విధానం:
1–2 టీ స్పూన్ల చక్కెర
1 చిన్న అల్లం ముక్క
4–5 పుదీనా ఆకులు
కొద్దిగా నిమ్మరసం
ఈ పదార్థాలను ఒక గ్లాస్ వేడి నీటిలో కలపాలి. అనంతరం గ్లాస్‌కి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తరువాత వడగట్టి నెమ్మదిగా తాగాలి.
ఈ పానీయం యొక్క ప్రయోజనాలు:
ఈ మిశ్రమం శరీరంలోని వాయువును బయటికి పంపడంలో సహాయపడుతుంది.
అల్లం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది మరియు గుండెల్లో మంటను తగ్గిస్తుంది.
పుదీనా శరీరాన్ని చల్లబరచి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
నిమ్మరసం శరీరంలోని అదనపు సోడియం మరియు హానికర అంశాలను తొలగించడంలో దోహదపడుతుంది.
ఈ పదార్థాలను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
గమనిక:
ఈ వార్తలో అందించిన సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. చెప్పిన ఇంటి చిట్కాలు వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా పనిచేయవచ్చు. మీకు తీవ్రమైన జీర్ణ సమస్యలు లేదా నిరంతరంగా ఉబ్బరం ఉంటే, తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!