

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల శరీరానికి అవసరమైన పోషకాలు, ఆహారపు అవసరాలు మారుతుంటాయి. అందువల్ల వయసుకు అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, మద్యపానానికి దూరంగా ఉండాలి. 20, 30 ఏళ్ల వయసులో ఉన్న పురుషులు పండ్లు, కూరగాయలు, గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పెరుగు, బీన్స్, పప్పులు, రాజ్మా, శనగలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
40 ఏళ్లు దాటిన పురుషులు రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ దశలో బీన్స్, వాల్నట్స్, జామకాయ, గ్రీన్ టీ, పాలు వంటి పోషక విలువలున్న ఆహారాలను తీసుకోవాలి. 50 ఏళ్లు దాటిన తర్వాత కండరాల బలాన్ని కాపాడుకోవడంతో పాటు గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. ఇక 60 ఏళ్లు దాటిన పురుషుల్లో కండరాల బలహీనత (సార్కోపెనియా) సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వయసులో తగినంత ప్రోటీన్ తీసుకుంటూ, సమతుల్య ఆహారం పాటించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!