

బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి అనే భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. కానీ పురుషుల్లో కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, కాలేయ సంబంధిత సమస్యలు, జన్యుపరమైన కారణాల వల్ల ఈ ముప్పు పెరుగుతోంది. ఛాతీ భాగంలో గడ్డలు, వాపు, చర్మంలో మార్పులు లేదా రొమ్ము భాగం నుంచి స్రావాలు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పురుషుల్లో ఈ వ్యాధిపై అవగాహన తక్కువగా ఉండటంతో చాలామంది ప్రారంభ లక్షణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిర్ధారణ కోసం పలు పరీక్షలు నిర్వహిస్తారు. పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు అందిస్తారు. సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాత్రమే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!