

చియా, సబ్జా విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పీచు పదార్థం, ఖనిజాలు, ఇతర పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. చియా విత్తనాల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్, కరిగే పీచు సమృద్ధిగా ఉండగా.. సబ్జా విత్తనాల్లో ఐరన్, మెగ్నీషియం, పీచు పదార్థం ఉంటాయి. వీటిని నానబెట్టినప్పుడు జెల్‌లా మారి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండి, ఆహారం అధికంగా తీసుకోకుండా ఉండేందుకు సహాయపడతాయి.
ఈ విత్తనాల్లోని పీచు జీర్ణక్రియకు, ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడటంతో పాటు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేయడం ద్వారా భోజనం తర్వాత రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నియంత్రించడంలో కూడా తోడ్పడవచ్చు. చియాలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాధారణంగా ఒక టీస్పూన్ చియా, ఒక టీస్పూన్ సబ్జాను ఒక గ్లాసు నీటిలో 15–20 నిమిషాలు నానబెట్టి తీసుకోవచ్చు. అయితే అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పరిమితంగా తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!