

ప్రస్తుత బిజీ జీవనశైలిలో ఫిట్‌నెస్‌తో పాటు రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం ఎంతో అవసరం. పాలు, పసుపు, అల్లం, కుంకుమపువ్వు కలయికతో తయారయ్యే గోరువెచ్చని పానీయం ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను అందిస్తుంది. దీనిని తయారు చేయడానికి రెండు కప్పుల పాలు, అర టీస్పూన్ పసుపు పొడి లేదా పసుపు తురుము, అర టీస్పూన్ అల్లం తురుము, 5 నుంచి 6 కుంకుమపువ్వు రేకులు, చిటికెడు మిరియాల పొడి అవసరం. రుచికి తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. పాలను సన్నని మంటపై వేడి చేస్తూ పసుపు, అల్లం, మిరియాల పొడి, కుంకుమపువ్వు వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. అనంతరం వడకట్టి, గోరువెచ్చగా అయిన తర్వాత తేనె లేదా బెల్లం కలిపి తాగవచ్చు.
పసుపు, అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి. అల్లం, మిరియాలు జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించవచ్చు. గోరువెచ్చని పాలు రాత్రివేళ తీసుకోవడం వల్ల విశ్రాంతి, నిద్రకు కూడా సహాయపడవచ్చు. కుంకుమపువ్వు శరీరానికి పోషక విలువలను అందిస్తుంది. అయితే జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య సమస్యలకు ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!