

భారతీయ సంప్రదాయంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. వంటల్లో మాత్రమే కాకుండా ఆయుర్వేదం, చర్మ సంరక్షణలో కూడా పసుపును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ గుణాలతో పసుపు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రంగా మారి దురదలు, ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మంపై పేరుకుపోయిన మురికి, చెమట, బ్యాక్టీరియాను తగ్గించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
పసుపు మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తగ్గించడమే కాకుండా వాపు, ఎర్రదనం, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి సహజ తేమను అందించి మృదుత్వాన్ని పెంచుతుంది. చిన్న గాయాలు, దద్దుర్లు త్వరగా మానేందుకు తోడ్పడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర దుర్వాసనను తగ్గించి చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది. అయితే ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం, సున్నితమైన చర్మం ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!