

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలామంది శారీరక శ్రమను తగ్గిస్తారు. ఉదయాన్నే నిద్రలేవడం, వ్యాయామం చేయడం బద్ధకంగా అనిపించడంతో రోజువారీ శారీరక చురుకుదనం తగ్గుతుంది. అదే సమయంలో ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే చలికాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒంటరిగా వ్యాయామం చేయడం కష్టంగా అనిపిస్తే స్నేహితుడు లేదా పార్ట్‌నర్‌తో కలిసి చేయడం ద్వారా ఆసక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు.
చలికాలంలో ఎండ తక్కువగా తగలడం కొంతమందిలో మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) కారణంగా ఆకలి, ఆహారపు కోరికల్లో మార్పులు రావచ్చని నిపుణులు వివరిస్తున్నారు. హార్మోన్లకు సంబంధించిన అంశాలు, రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండటం, అర్ధరాత్రి చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి స్నాక్స్ తినడం కూడా బరువుపై ప్రభావం చూపవచ్చు. వీటికి బదులుగా పండ్లు, నట్స్‌ను మితంగా తీసుకోవడం మంచిది. అలాగే తగినంత నీరు తాగడం, సీజనల్ పండ్లు, కూరగాయలు, గుడ్లు, గింజలు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆహారం లేదా వ్యాయామంలో ముఖ్యమైన మార్పులు చేసుకునే ముందు మీ వైద్య నిపుణులను సంప్రదించండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!