
జనరల్

ఉదయం పూట సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. గ్యాస్ సమస్యలు కలిగించే ఆహారాలను తప్పించి తేలికపాటి, పోషకాహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ అట్టకు బదులుగా పెసరపప్పుతో చేసే పెసరట్టు మంచి ఎంపిక. ఇది ప్రోటీన్‌తో నిండి ఉండి మెత్తగా, స్పాంజిలా ఉండటంతో పాటు సులభంగా జీర్ణమవుతుంది. అల్లం, పచ్చిమిర్చి వేసి తయారు చేస్తే రుచి మరింత పెరుగుతుంది.
తయారీ కోసం పెసరపప్పును ఆరు గంటలు నానబెట్టి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్రతో కలిసి బరకగా పేస్ట్ చేయాలి. అందులో ఉప్పు, కొత్తిమీర, పెరుగు వేసి గంట పాటు ఉంచాలి. అట్టులు వేయడానికి ముందు బేకింగ్ సోడా కలిపితే మరింత మెత్తగా అవుతాయి. వేడి పెనంపై పిండిని పోసి, నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చితే వేడి వేడి పెసరట్టు సిద్ధం. దీనిని కొబ్బరి, అల్లం లేదా పల్లీ చట్నీతో వడ్డించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!