

చాలామంది నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్‌ను దిండు కింద పెట్టుకుంటారు. ఫోన్ అందుబాటులో ఉండటంతో పాటు అలారం సులభంగా వినిపిస్తుందని భావిస్తారు. అయితే ఈ అలవాటును నిపుణులు నివారించాలని సూచిస్తున్నారు. ఫోన్‌ను ఎక్కువసేపు తలకు దగ్గరగా ఉంచడం వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ శక్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రివేళ అధికంగా ఫోన్ ఉపయోగించడం నిద్రపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా దిండు కింద ఫోన్ పెట్టడం వల్ల గాలి ప్రసరణ తగ్గి వేడెక్కే అవకాశం ఉంటుంది.
ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి దిండు కింద పెట్టడం మరింత ప్రమాదకరం. గాలి ప్రసరణ లేకపోవడంతో ఫోన్ అధికంగా వేడెక్కి బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది. పరుపు లేదా దిండు కింద ఛార్జింగ్ చేయడం వల్ల అగ్ని ప్రమాదం కూడా సంభవించవచ్చు. అందువల్ల నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను దిండు కింద పెట్టకుండా, మంచానికి కొంత దూరంలో ఉన్న టేబుల్‌పై లేదా గాలి సులభంగా ప్రసరించే గట్టి ఉపరితలంపై ఉంచడం మంచిది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!