

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటికే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల తార.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమైంది. శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ సినిమాలో డింపుల్ కీలక పాత్ర పోషించింది. అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో డింపుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మందారం రంగు చీరలో అందంగా ముస్తాబై వేడుకకు హాజరైన ఆమె.. హీరో శర్వానంద్‌తో కలిసి సందడి చేసింది.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఓ నెటిజన్ డింపుల్‌కు కూడా పెళ్లయిపోయిందా? అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆమె సరదాగా స్పందిస్తూ.. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. గతంలో డింపుల్ పెళ్లిపై పలు వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. తాజాగా తనకు ఇంకా వివాహం కాలేదని ఆమె స్పష్టం చేసింది. ఇక ‘భోగి’ సినిమాలో డింపుల్ ‘మందారం’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు తనపై ఉన్న గ్లామర్ ఇమేజ్‌ను ఈ సినిమా మార్చేస్తుందని, తన కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!