

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'పుష్ప' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రష్మిక, పుష్ప 2 సక్సెస్ తో ఇప్పుడు దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇటీవల తన వ్యక్తిగత విషయాలతో తరుచుగా వార్తల్లో నిలుస్తున్న అమ్మడు తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
తాజాగా రష్మిక మందన్నా ఒక ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో, బ్లాక్ మాస్క్ ధరించి సింపుల్‌గా కనిపించిన ఆమెను ఫోటోగ్రాఫర్లు, అభిమానులు చుట్టుముట్టారు. ఎప్పటిలాగే ఫోటోల కోసం "మాస్క్ తీయండి మేడమ్, ఒక ఫోటో ప్లీజ్!" అని కోరారు. కానీ ఈసారి రష్మిక మాత్రం మాస్క్ తీసే ప్రయత్నం చేయలేదు. రష్మిక నవ్వుతూ "ఫేస్ ట్రీట్మెంట్ అయ్యింది గైస్, తీయలేను" అని చెప్పింది. ఆ ఒక్క మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "రష్మిక ముఖానికి ఏమైంది?", "ఏ ట్రీట్మెంట్ చేయించుకుందో?", "లిప్ ఫిల్లర్ వేయించుకుందేమో?" అంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. కొన్ని ఫోటోలు, వీడియోల్లో ఆమె లుక్‌లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తాజా లుక్స్‌ని పరిశీలించిన నెటిజన్లు ముఖ్యంగా ఆమె లిప్స్ దగ్గర చిన్న మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు. "లిప్ ఫిల్లర్స్ వేసుకుందేమో?" అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు "స్కిన్ గ్లో ట్రీట్మెంట్ చేసుకుందేమో?" అని కామెంట్లు చేస్తున్నారు.
















కామెంట్స్ (2)
Beauty with simplicity!
Queen vibes