
జనరల్

తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. జలాశయం నీటిమట్టం 1,628.20 అడుగులకు పెరిగింది. గత 24 గంటల్లో సగటున 26,834 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా, ప్రస్తుతం 23,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. వివిధ కాలువలకు 2,226 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తుంగభద్ర జలాశయం నూతన క్రస్ట్ గేట్లను మూడు రంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా జలాశయ బోర్డు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15న పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!