
సినిమాలు

చియాన్ విక్రమ్ నటించిన ‘ధృవ నచ్చతిరం ’ సినిమా తొమ్మిదేళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదట ప్రకటించినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన వివాదాల కారణంగా విడుదల పలుమార్లు వాయిదా పడింది.
తాజా సమాచారం ప్రకారం, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమైతే వచ్చే నెల 27న థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓటీటీకి కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. హారిస్ జయరాజ్ సంగీతం, విక్రమ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!