

ఇటీవల రష్మిక మెడలో మూడుమూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు విజయ్ దేవరకొండ. సొంతూరులో ఫంక్షన్, హైదరాబాద్‌లో సెలబ్రిటీల కోసం రిసెప్షన్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆయన మళ్లీ షూటింగ్ డ్యూటీ ఎక్కనున్నారు. ప్రస్తుతం విజయ్ ‘రౌడీ జనార్థన్’, ‘రణబాలి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో రష్మిక కథానాయికగా తెరకెక్కుతోన్న ‘రణబాలి’ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 12 నుంచి మొదలుకానుంది. కర్నూల్లో జరగబోయే ఈ షూటింగ్ సెట్లో విజయ్ అడుగుపెట్టనున్నారట.
తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుందని టాక్. ప్రస్తుతం విజయ్ - శౌర్యువ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ‘హాయ్ నాన్న’ తర్వాత తారక్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు శౌర్యువ్. అది కార్యరూపం దాల్చలేదు. ఓ తమిళ హీరోకు కూడా కథ చెప్పారట. అదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహితుల నుంచీ సమాచారం. అయితే ఇది పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కే చిత్రమని తెలిసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!