

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్ర కోసం చిరంజీవిని చాలా యంగ్ లుక్‌లో చూపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు చూడని విధంగా ఆ పాత్రను డిజైన్ చేశారని సమాచారం. మరో పాత్రలో మాత్రం చిరంజీవి సాధారణ లుక్‌లో కనిపించనున్నారట. రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ కూడా కథలో కీలకంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. కథ కూడా ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మెగాస్టార్‌ను కొత్తగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతోనే బాబీ కొల్లి కథను సిద్ధం చేసినట్లు టాక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ కాంబినేషన్‌పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!