

రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయం సాధించింది. కేవలం హిందీ భాషలోనే విడుదలై, వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన ఘట్టం. ఈ సినిమా ఫుల్ రన్లో 1500 కోట్ల గ్రాస్ దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర భాషల వసూళ్ల సహాయం లేకుండా, ఒక్క హిందీ నుంచే ఇంత భారీ వసూళ్లు రావడం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దురంధర్ 2’ వచ్చే ఏడాది మార్చి 19 న విడుదల కానుంది. ఈసారి సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగంలో విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నా పాత్రకు వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే. హీరోను మించిపోయేలా ఆయన నటన ఉందని ప్రేక్షకులు ప్రశంసించారు. అందుకే పార్ట్ 2 లో విలన్ పాత్ర మరింత బలంగా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం, ఈ కీలక విలన్ పాత్ర కోసం టాలీవుడ్ క్రేజీ హీరో అక్కినేని నాగార్జునను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కూలీ’ సినిమాలో విలన్‌గా నటించి కొత్త కోణాన్ని చూపించిన నాగార్జునకు ఆ పాత్రపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ‘దురంధర్ 2’ లో ఆయన పాత్ర హీరోకి సమానంగా, చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో నాగార్జునకు వచ్చిన ఈ అవకాశం ఆయనకు అసలైన కమ్‌బ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!