

శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రొవైడర్లకు అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నవంబర్ 5, 2026న కీలక సిఫార్సులు విడుదల చేసింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023లోని సెక్షన్ 3(1)(b) కింద శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ (ఎస్‌సీఎన్) ప్రొవైడర్ ఆథరైజేషన్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ అనుమతి దేశవ్యాప్తంగా వర్తించేలా ఉండటంతో పాటు గరిష్ఠంగా 20 ఏళ్ల కాలపరిమితితో మంజూరు చేయాలని సూచించింది.
ఈ అనుమతి పొందే సంస్థలకు సంబంధించిన ఆర్థిక నిబంధనలను కూడా ట్రాయ్ ప్రతిపాదించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్)లో 8 శాతాన్ని ఆథరైజేషన్ ఫీజుగా వసూలు చేయాలని, కనీస ఫీజు ఉండకూడదని పేర్కొంది. ఎంట్రీ ఫీజును రూ.37,50,000గా, ప్రారంభ గ్యారంటీని రూ.45,00,000గా నిర్ణయించాలని సూచించింది. కనీస ఈక్విటీ, నికర విలువ ఒక్కొక్కటి రూ.60,00,000గా ఉండాలని, దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000గా నిర్ణయించాలని సిఫార్సు చేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!