

బిగ్‌బాస్ తెలుగు 10లో ప్రస్తుతం రివార్డ్ అండ్ రివేంజ్ థీమ్ కొనసాగుతోంది. 9వ వారంలో కుటుంబ సభ్యులను కలుసుకోవాలంటే కంటెస్టెంట్లు టాస్కుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన పోటీల్లో శ్వేత, వంశీలకు రివార్డులు దక్కగా.. వారు ఎంచుకున్న రివేంజ్ కారణంగా ఆర్కే, వర్షిణిలకు సవాళ్లు ఎదురయ్యాయి. ఇక తాజాగా విడుదలైన డే 60 ప్రోమోలో మరో ఫిజికల్ టాస్క్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఐదుగురు కంటెస్టెంట్లు, వారికి బయట నుంచి ఐదుగురు సపోర్టర్లు ఈ పోటీలో పాల్గొనాలి. కంటెస్టెంట్లు బాల్‌ను తీసుకెళ్లి తమ సపోర్టర్లకు అందించాలి. వారు దాన్ని బాస్కెట్‌లో పడేలా విసరాలి. ప్రయత్నం విఫలమైతే సంచాలక్ ఆ బాల్‌ను మరో సపోర్టర్‌కు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్‌కు వర్షిణి సంచాలక్‌గా వ్యవహరిస్తోంది.
ఈ పోటీలో రాం ప్రసాద్, నరేష్, శివ్, త్రిగుణ్, దేబ్జానీ పాల్గొన్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. త్రిగుణ్ పలుమార్లు బాల్‌ను తీసుకొచ్చినట్లు, రాం ప్రసాద్, నరేష్ కూడా తమ సపోర్టర్ల ద్వారా బాస్కెట్‌లో బాల్ వేయించడంలో ముందున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేబ్జానీ, శివ్ మాత్రం వెనుకబడినట్లు కనిపిస్తున్నారు. టాస్క్‌లో ఫిజికల్‌గా వ్యవహరిస్తున్న తీరుపై దేబ్జానీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. సంచాలక్‌గా వర్షిణి వ్యవహరిస్తున్న విధానంపై అమన్ అసంతృప్తి తెలిపాడు. తనకు అవకాశం ఇవ్వకుండా ముకేష్‌కు అవకాశం కల్పించారని వాదించాడు. ఈ నేపథ్యంలో టాస్క్‌లో విజయం ఎవరిని వరిస్తుంది? ఎవరికి రివార్డ్, ఎవరికి రివేంజ్ దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, రోహిత్ త్వరలోనే హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియాలో లీకులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!