
సినిమాలు

తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని ఆరోపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ఈ ఆరోపణలు నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. భాజపా, కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత అవగాహనే దీనికి కారణమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో ఏ బిల్డర్‌ను అడిగినా ఆర్‌ఆర్ ట్యాక్స్ వాస్తవమేనని చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో చదరపు అడుగుకు రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని పరోక్షంగా డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ అంశంపై రాజకీయ విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!