
సినిమాలు

ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు కీలక ట్రేడ్‌ను పూర్తి చేశాయి. ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య నలుగురు ఆటగాళ్ల మార్పిడి జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ సీఎస్కే జట్టులోకి చేరనున్నారు.

మరోవైపు, భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వెళ్లనున్నారు. సవరించిన ఒప్పందం ప్రకారం లివింగ్‌స్టోన్‌కు రూ.6 కోట్ల ఫీజు ఖరారు కాగా, జాక్ ఎడ్వర్డ్స్‌కు రూ.3 కోట్లు చెల్లించనున్నారు. ఇక ఖలీల్ అహ్మద్‌కు రూ.4.8 కోట్లు, నాథన్ ఎల్లిస్‌కు రూ.2 కోట్ల ఫీజు నిర్ణయించారు. ఈ మార్పులతో రెండు జట్లు తమ ఆటగాళ్ల సమతూకాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!