

అమెరికా ఎన్నికల పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలకు తోడు క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 5 శాతం మేర తగ్గడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,008 పాయింట్లు లాభపడగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 576 పాయింట్ల పెరుగుదలతో ముగిసింది.
మార్కెట్ల భారీ ర్యాలీతో ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ దేశీయ సూచీలు లాభాలను నమోదు చేశాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కలిపి సుమారు 10 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణి, ముడి చమురు ధరల తగ్గుదల, కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ప్రధానంగా అండగా నిలిచాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!