

తాంత్రిక జ్యోతిష్యుడు వేణు స్వామి మూడురోజుల పాటు బగళాముఖి హోమం నిర్వహించినట్లు, ఆ విషయాన్ని ఆయనే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. త్వరలో విడుదలకానున్న భారీ చిత్ర విజయంకోసమే ఈ హోమం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ నెలలో విడుదలయ్యే ఒకే ఒక్క భారీ సినిమా ‘అఖండ 2’ కావడంతో, ఈ హోమం అదే సినిమా కోసం జరిగిందనే చర్చ సినీ వర్గాల్లో ఊపందుకుంది.
ఈ విషయానికి మరో బలమైన కారణం కూడా ఉంది. నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులకు వాస్తు, జ్యోతిష్యం, ముహూర్తాలపై గట్టి నమ్మకం ఉంది. బాలయ్య తీవ్రమైన తాంత్రిక క్రియలకు దూరంగానే ఉంటారని చెప్పినా, ముహూర్తం చూసుకోకుండా ముఖ్యమైన పనులను మాత్రం ప్రారంభించడు. ఇక సంక్రాంతికి విడుదలకానున్న ఇతర సినిమాల పనులు ఇంకా కొనసాగుతుండటంతో, ప్రస్తుతం ఈ బగళాముఖి హోమం పూర్తిగా ‘అఖండ 2’ విజయాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్వహించారని సినీ వర్గాలు, పరిశీలకులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (1)
సినిమా ఎలా ఉంటుందో చూడాలి!